BREAKING NEWS

2/12/15

Telugu Quotes on True Effort and Service

Telugu-Quotes-on-True-Effort-and-Service
Telugu-Quotes-on-True-Effort-and-Service

"ప్రజలు మనల్ని మంచివారంటారు, చెడ్డవారంటారు.  కాని
ఆదర్శాన్ని ముందుంచుకొని సింహాలలాగా మనం పనిచెయ్యాలి. "

"మానవుడు ఎంత గొప్పవాడైతే, అంత కఠినమైన
పరీక్షలను దాటవలసి ఉంటుంది. "

"ప్రతిఘటన, వ్యతిరేకత ఎంత ఉంటే అంత మంచిది.  ప్రతిఘటన లేనిదే
నదికి వేగం వస్తుందా? ఒక విషయం ఎంత క్రొత్తదైతే, ఎంత మంచిదైతే
ప్రారంభ దశలో అది అంత వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది.
వ్యతిరేకత ఎక్కడైతే ఉండదో అక్కడ విజయం కూడా ఉండదు. "

"కఠోర సత్యమేమంటే - నీలో యదార్ధమైన శక్తి ఉన్నట్లయితే, పరిస్థితులు నీకు
ఎంత ప్రతికూలంగా ఉంటే, నీలో ఉన్న అంతర్గత శక్తి అంత ఎక్కువగా వ్యక్తమౌతుంది. "

"లోకమంతా నీచమైన ప్రాపంచికతతో నిండిపోయింది. కాని
నైతికబలం, వివేకం కలవాళ్ళు వీటివల్ల ఎప్పుడూ మోసపోరు.
'లోకం తన ఇష్టం వచ్చినట్ట్లు మాట్లాడనీ, నేను ధర్మమార్గాన్నే
అనుసరిస్తాను'... ఇది ధీరుని విధానం అని తెలుసుకో. "

"ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యాయామశాల.  ఇక్కడికి మనం రావడం
మనల్ని మనం బలవంతులుగా చేసుకోవడానికే. "

"ధైర్యశాలివై ముందుకు నడు.  ఒక్క రోజులోనో, ఒక్క సంవత్సరంలోనో
విజయాన్ని ఆశించకు.  ఎల్లప్పుడు ఉత్తమోత్తమమైన ఆదర్శమును
కలిగి ఉండు.  స్థిరత్వం కలిగి ఉండు.  అసూయ,  స్వార్ధాలను విడిచిపెట్టు. "
 
"ప్రతి పని ఈ మూడు దశలను దాటాలి -
అవహేళన, వ్యతిరేకత, తరువాత ఆమోదం. "

"నీవు నిజంగా ఇతరుల శ్రేయాన్ని కోరితే, ప్రపంచమంతా వ్యతిరేకమై ప్రయత్నించినా,
 అది నీకు ఏ అపకారం చేయలేదు.  నీవు నిజంగా నిస్వార్ధపరుడవై, నిష్కపటివై ఉంటే
ఈశ్వరుని స్వకీయశక్తిచే ఆ వ్యతిరేకత అంతా తునాతునకలై పోతుంది. "

"మీలో ప్రతివారు, నాకంటే నూరురెట్లు గొప్పవారు కావాలి.  మీలో ప్రతిఒక్కరూ
ఒక వీరాధి వీరుడు కావాలి.  విధేయత, సంసిద్ధత, పనిమీద శ్రద్ధాభక్తులు -
ఈ మూడూ మీలో ఉంటే, మిమ్మల్ని ఏ శక్తీ అడ్డుకోలేదు. "

"ఈ జీవితం క్షణికం. ప్రామంచిక భోగాలు అశాశ్వతాలు.  ఇతరుల కొరకు
జీవించేవారే యథార్ధంగా జీవిస్తున్న వారు.  తక్కినవారు జీవన్మృతులు."

"లోకంలో సదా దాతవై వర్థిల్లు.  సహాయం - సేవ చేయి, నీవు ఇవ్వగలిగిన
ఏ అల్పవస్తువునైనా ఇవ్వు.  వస్తు మార్పిడి పద్ధతికి దూరంగా ఉండు."

"మృత్యువు అనివార్యమైనపుడు, రాళ్ళు రప్పల్లాగా ఉండటంకంటే
ధీరుల్లాగా మరణించటం శ్రేయస్కరం."

"ఈ ప్రపంచమనే నరకంలో ఏ ఒక్క హృదయంలో ఏ కాస్తయినా
శాంతి సౌఖ్యాలు కలిగించగలిగితే అదే 'సత్కర్మ' అనిపించుకుంటుంది."

Telugu Quotes on True Effort and Service By Swami Vivekananda

Post a Comment