BREAKING NEWS

2/7/15

Secret of Work Quotes in Telugu

secret of work quotes in telugu
'హృదయానికి మనసుకి సంఘర్షణ జరిగినప్పుడు, హృదయాన్ని అనుసరించు అంటూ' Secret of Work Quotes లో స్వామి వివేకానంద చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇదే కర్మ రహస్యం.

"ప్రాణమున్నంత వరకు పనిచేయండి.  ఈ జీవితం వస్తుంది పోతుంది.  సంపద, కీర్తి, భోగాలు
మూడునాళ్ళ ముచ్చటే.  ఒక ప్రాపంచిక క్షుద్రకీటకం వలె చనిపోవడం కన్నా
సత్యాన్ని బోధిస్తూ కార్యరంగంలో మరణించడం ఉత్తమం.  ముందంజ వేయండి!"

"మీలో ప్రతి ఒక్కరూ కార్య భారమంతా
మీపైనే ఉందన్న భావంతో పని చేయండి."

"ఏ ఘనకార్యాన్నీ మోసంతో సాధించలేం.  అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే
సమస్త కార్యాలు సాధించబడతాయి.  కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి."

"జన సమూహం కాదు కావలసింది.  పామరుల గుంపు ఒక శతాబ్దంలో చేసిన పనికంటే,
హృదయపూర్వకంగా పనిచేస్తే ఒక్క సంవత్సరములోనే ఎక్కువగా సాధించగలరు."

"ధైర్యంతో కర్తవ్యాన్ని నిర్వహించు.  ఓర్పు, స్థిరత్వాలతో పనిచేయి...
ఇదే ఏకైక మార్గము.  ఓర్మి, పవిత్రత, ధైర్యం, స్థిరత్వంతో్ పనిచేయాలని
గుర్తుంచుకొని ముందుకు నడువు.  పవిత్రంగా ఉండి నీ ఆదర్శాలకు
కట్టుబడి ఉన్నంత కాలం నీకు అపజయం కలుగదు."

"నీ ప్రతి పనిలోనూ ఆచరణాత్మకతను కనబరచు.  ఆచరణ కొరవడిన
అనేక సిద్ధాంతాల వల్లే దేశం పూర్తిగా నాశనమైంది."

"మనకు కావలసింది స్పందించే హృదయం, ఆలోచించే మెదడు,
పనిచేసే బలిష్టమైన హస్తం.  కర్మ చేసే యోగ్యతను సంపాదించు.
హృదయానికి మనసుకి సంఘర్షణ జరిగినప్పుడు, హృదయాన్ని అనుసరించు."

"మీకు కొద్దిపాటి కల్పనాశక్తి లేకపోతే, మార్గదర్శకమైన ఆదర్శం లేకపోతే,
మీరు కేవలం పశుతుల్యులే.  కాబట్టి మీ ఆదర్శాన్ని తగ్గించుకోకూడదు.
అలా అని అసాధ్యమైన దాన్ని ప్రయత్నించరాదు.  ఉన్నత ఆదర్శంతో
ఉత్తమ ఆచరణాన్ని మీ జీవితంలో సమన్వయపరచడానికి ప్రయత్నించండి."

"మన దేశపు ఆశలన్నీ మీపైనే ఉన్నవి.  సోమరులుగా మీరు కాలం గడపటం
నాకు బాధను కలిగిస్తోంది.  కార్యదీక్షాపరులు కండి.  ఆలస్యం చేయవద్దు.
అంతా సరియైన సమయంలో జరుగుతుందని సోమరులుగా కూర్చోవద్దు.
ఆ విధంగా ఏ పనీ నెరవేరదని గుర్తుంచుకోండి."

"వ్యర్ధకాలయాపన పనికి రాదు.  అసూయ, అహంకారం అనే భావాలను పూర్తిగా విడిచిపెట్టండి.
అప్రతిహతమైన శక్తితో కార్యరంగం లోకి దూకి సాహసవంతులుగా పని చేయండి."

"నా ఉద్వేగం మీకింకా ఒంటపట్టలేదు.  నన్ను మీరు అర్ధం చేసుకోలేదు.
సోమరితనం, సుఖానుభవం అనే పాతపంథాలలోనే మీరింకా పరుగెత్తుతున్నారు.
ఈ అలసత్వం ఇక చాలు.  ఇహపర ఫలభోగాసక్తి ఇక చాలు."

"మీరు నా ఉద్వేగాగ్నిని అందుకోవాలని, అత్యంత
నిష్కపట వర్తనులవ్వాలని నా నిరంతర ప్రార్ధన."
Secret of Work Quotes in Telugu.

Post a Comment