BREAKING NEWS
Showing posts with label online-money. Show all posts
Showing posts with label online-money. Show all posts

1/11/15

how to upload videos on youtube and earn money

యూట్యూబ్ లో వీడియోలను అప్లోడ్ చేసి మంచి ఆదాయం పొందడం ఎలా?

how to upload videos on youtube and earn money
యూట్యూబ్ లో వీడియోలను అప్లోడ్ చేసి మంచి ఆదాయం పొందడం ఎలా? (how to upload videos on youtube and earn money?) యూట్యూబ్ లో వీడియోలను అప్లోడ్ చేసి మంచి ఆదాయం పొందడం ఎలా? (how to upload videos on youtube and earn money?)
యూట్యూబ్ లో వీడియోలను అప్లోడ్ చేసి మంచి ఆదాయం పొందాలంటే ఈ క్రింది దశలను పాటించవలెను.
1. మంచి క్వాలిటీ, మరియు ఆసక్తి గల వీడియోలను సొంతంగా కెమెరాతో రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి.
2. మీరు ఏదైనా టెక్నాలజీలో గాని ఇతర సబ్జెక్టులలో గాని ఎక్స్ పర్ట్ అయివుంటే మీ కంప్యూటర్ లో మంచి వీడియోలను రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి. మీ కంప్యూటర్ లో వీడియోలను రికార్డ్ చేయుటకు, మీ కంప్యూటర్ స్క్రీనును రికార్డ్ చేసే "స్క్రీను రికార్డర్ సాఫ్ట్ వేర్" (ఉదా: camstudio)గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి  మీ కంప్యూటర్ లో install చేయాలి. ఈ స్క్రీను రికార్డర్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి వీడియోలను  రికార్డ్ చేయవచ్చును.
3. తరువాత youtube.com ను open చేసి, gmail id మరియు password ఉపయోగించి login అవ్వాలి. తరువాత upload పై క్లిక్ చేసి, మీరు తయారుచేసిన వీడియోలను  అప్లోడ్ చేయాలి.
4. వీడియోలను అప్లోడ్ చేసిన తరువాత "youtube adsense" కొరకు అప్లైచేసుకోవాలి. మీ adsense అకౌంట్ అప్రూవల్ అయిన తరువాత యూట్యూబ్ వారు మీ వీడియోలతో పాటు వ్యాపార ప్రకటనలను కూడా display చేస్తారు. ఈ వీడియోలను చూసే యూజర్ల సంఖ్యను  బట్టి మీకు ఆదాయం వస్తుంది.

how to get freelance jobs and earn money

freelance జాబ్స్ ను పొందడం మరియు వాటి ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

how to get freelance jobs and earn money
ఫ్రీలాంసింగ్ జాబ్స్ ను పొందడం మరియు వాటి ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా? (how to get freelance jobs and earn money). ఇంటర్నెట్ ద్వారా పెట్టుబడి లేకుండా చట్టపరంగా డబ్బులు సంపాదించే ముఖ్యమైన మార్గాలలో freelance jobs ఒకటి. freelance jobs అంటే ఏమిటి? అవి ఏఏ విద్యా విభాగాలలో లభిస్తాయి?  ఏఏ వెబ్ సైట్ల ద్వారా వాటిని పొందవచ్చును?  freelance jobs  కొరకు ఫ్రీ రిజిస్ట్రేషను ఎలా చేసుకోవాలి? అర్హత పరీక్షలను ఎలా పూర్తి చేయాలి?  మరియు వాటి కొరకు అప్లై చేసుకొనే విధానం మొదలైన వివరాలు ఈ వెబ్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చును.
1.Freelancing: మీ తీరిక నమయం లో ఇంటివద్ద నుంచే ఇంటెర్నెట్ ద్వరా డబ్బు సంపాదించే మర్గాలలో మొదటిది "freelancing jobs". ఎటువంటి వయోపరిమితి, ఖర్చు లేకుండా కొన్ని వెబ్ సైట్స్ లో ఫ్రీగా రిజిస్టర్ అయి, జాబ్స్ కొరకు అప్లయ్ చేసుకొని, ఆ జాబ్స్ ని ఇంట్ల్లోనే పూర్తి చేసి, తిరిగి క్లయింట్ కి పంపిస్తే, మీకు డబ్బులు చెల్లిస్తారు.  దీనిని పార్ట్ టైం జాబ్ గా ప్రారంభించి, ఆదాయం పెరిగిన తరువాత ఫుల్ టైం జాబ్ గా చేసుకోవచ్చును. కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన దాదాపు 90% విద్యా విభాగాలకు చెందిన జాబ్స్ ను ఫ్రీలాంసింగ్ ద్వారా ఇంటివద్దనే చేసుకొనే అవకాశం వుంటుంది. వీటిలో రెండు రకాల జాబ్స్ ఉంటాయి.
1. Fixed Price Jobs
2. Hourly Jobs

Fixed Price Jobs:  దీనిలో జాబ్ యొక్క మొత్తం ధర(జీతం) ముందుగానే నిర్ధారించబడుతుంది. మీరు ఆ జాబ్ పూర్తి చేసిన తరువాత నిర్ధారిత సొమ్ము మీకు చెల్లించబడుతుంది.
Hourly Jobs:  దీనిలో మీరు పని చేసిన ప్రతి గంటకు ధర నిర్ధారించబడుతుంది. మీరు ఒక గంట పని  పూర్తి చేయగనే, ఆ గంట పని యొక్క డబ్బులు మీ అకౌంట్ లో వెంటనే జమ అవుతాయి. అలా మీరు పని చేసిన ప్రతి గంటకు నిర్ధారిత సొమ్ము మీకు చెల్లించబడుతుంది. Freelance జాబ్స్ లభ్యమయ్యే కొన్ని ముఖ్యమైన విభాగాలను ఈక్రింద ఇవ్వబడినవి.
Web Programming Technical Writing Website Design
Sales Writing Mobile Applications Report Writing
Software Application Sales & Marketing Database Development
Search Engine Marketing Search Engine Optimization     Lead Generation
System Administration Ad Campaigns Technical Support
Telemarketing Data Analysis Marketing Strategy
Networking & Security Product Marketing Business Intelligence
Marketing & Sales Consulting      Database Administration Email Marketing
Testing & QA Sales Presentation Design & Multimedia
Virtual Assistant Graphic Design Data Entry
Logos Research Videos
Customer Service Illustration Social Network Management
Animation Transcription Digital Image Editing
Content Management Brochures Technical Support
Photography Office Management Presentations
Word Processing Cartoons & Comics Electrical
Label & Package Design Product Design Emails & Newsletters
Banner Ads Architecture Article Writing
Mechanical CAD 3D Modelling
E-books and Blogs Civil & Structural Translation
Accounting Copywriting Investment Analysis
Creative Writing Management Consulting Editing & Proofreading
Financial Planning Academic Writing Patent, Copyright and Trademarks

freelance jobs ఆఫర్ చేసే వెబ్ సైట్లు ఈ క్రింద  ఇవ్వబడినవి:

1. https://www.elance.com/

2. https://www.odesk.com/

3. https://www.freelancer.in/

4. ttp://www.peopleperhour.com/

5. https://studio.envato.com/

6. http://www.guru.com/

7. https://www.seoclerks.com/

8. http://www.topcoder.com/

9. http://www.mediabistro.com/

10. http://99designs.com/

11. http://www.freelancers.net/

12. http://www.clickworker.com/en

13. http://www.freelance.com/en/

14. http://freelanceindia.com/

15. http://www.freelancermap.com/

16. http://www.genuinejobs.com/index.php

17. http://www.translatorsbase.com/

18. http://www.getacoder.com/

19. https://www.project4hire.com/

20. http://www.scribendi.com/

1/8/15

how to earn money with google adsense

గూగుల్ AdSense ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

earn money with google adsense
గూగుల్  AdSense  అంటే  ఏమిటి?    గూగుల్  AdSense ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?  (What is Google AdSense and  how to earn money with  Google AdSense?)
గూగుల్ adsense అనేది వ్యాపార ప్రకటనలకు సంబంధించిన ఒక ప్రోగ్రాం. వివిధ వ్యాపార సంస్థల వారు తమ ప్రోడక్టు లేదా సర్వీసు యొక్క ప్రకటనలను వివిధ వెబ్ సైట్లలో ప్రదర్శించడానికి గూగుల్ ప్రతినిధులను సంప్రదించి  డబ్బులు చెల్లిస్తారు. ఈ ప్రోగ్రాంలో్ వివిధ రకాల వ్యాపార సంస్థల వారు ఇచ్చిన ప్రకటనలను ప్రైవేట్ వ్యక్తులకు సంబంధిన వివిధ వెబ్ సైట్లలో ప్రదర్శించడం (display) చేస్తారు. ఈ ప్రోగ్రాం నే గూగుల్ AdSense అంటారు. ఈ ప్రకటనలను ప్రదర్శించిన వెబ్ సైట్లను సందర్శ్హించిన ప్రేక్షకులు ఏదైనా ప్రకటన పై క్లిక్ చేస్తే, ఆ వెబ్ సైట్ యజమానికి గూగుల్ వాళ్ళు డబ్బులు చెల్లిస్తారు. (వ్యాపార సంస్థల వారు గూగుల్ కి చెల్లించిన సొమ్ములోనుంచి సుమారుగా 68 శాతం వరకు ఈ ప్రకటనలను ప్రదర్శించిన వెబ్ సైట్ యజమానికి చెల్లిస్తారు). ఒక వెబ్ సైట్లో వున్న కంటెంట్ ను ఆధారంగా ఈ యాడ్స్ ను ప్రదర్శిస్తారు. ఉదాహరణకు: ఒక వెబ్ సైట్లో మొబైల్స్ కు సంబంధించిన కంటెంట్ వుంటే, ఆ వెబ్ సైట్లో మొబైల్స్, మొబైల్ కవర్స్, మొబైల్ సాఫ్ట్ వేర్, మొబైల్ గేంస్, వివిధ మొబైల్ పరికరాలు, మొబైల్ ఇంటెర్నెట్ మరియు టెలికాం సర్వీసులకు సంబంధించిన యాడ్స్ ను ప్రదర్శిస్తారు.

ఇంటర్నెట్ ద్వారా పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించే వేరొక విధానం "Google AdSense". ఈ విధానం ద్వారా డబ్బులు సంపాదించాలంటే మీకు సొంతంగా ఒక వెబ్ సైట్ వుండాలి.  మీ వద్ద పెయిడ్ వెబ్ సైట్ (with hosting and domain registration) లేదా ఫ్రీ వెబ్ సైట్ తయారు చేసుకొని, మంచి కంటెంట్ పోస్ట్ చేసి, నెలకు సుమారుగా 300 మంది మీ వెబ్ సైట్ ను visit చేస్తూ వుంటే, మీరు "Google AdSense" కొరకు అప్లయ్ చేసుకోవచ్చు. మీ AdSense account ఆమోదం పొందిన  తరువాత గూగుల్ వాళ్ళు ఇచ్చిన యాడ్స్ ను మీ వెబ్ సైట్ లో display చేయడం ద్వారా మీరు మంచి ఆదాయం పొందవచ్చును. మీ వెబ్ సైట్ ను సందర్శ్హించే ప్రేక్షకులు (visitors) మరియు వెబ్ పేజీల  సంఖ్యను బట్టి మీ ఆదాయం వుంటుంది.  ఈ సంఖ్యను పెంచుకోవడం ద్వారా మీ ఆదాయం పెరుగుతుంది. మీ వెబ్ సైట్ లో నలుగురికీ ఉపయోగపడే unique content ను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ visitors ను పెంచుకుంటుంటే ఈ విధానం లో పరిమితి లేని ఆదాయం పొందవచ్చును.  గూగుల్ AdSense కొరకు అప్లయ్ చేసేందుకు క్రింది నిబంధనలు తప్పనిసరి.

1. గూగుల్ AdSense కొరకు అప్లయ్ చేసే వారి వయస్సు 18 సంవత్సరములు నిండి వుండాలి.
2. మీ వెబ్ సైట్ వయస్సు కనీసం ఆరు నెలలు కలిగి వుండాలి (అంటే మీ వెబ్ సైట్ తయారుచేసి /హోస్టింగ్ చేసిన ఆరు నెలలు తరువాత గూగుల్ AdSense కొరకు అప్లయ్ చేసుకోవలెను).
3. మీ వెబ్ సైట్లో డూప్లికేట్ సమాచారం వుండకూడదు (అంటే వేరే వెబ్ సైట్లో వున్న మాదిరిగా కాకుండా different గా వుండాలి).
4. మీ వెబ్ సైట్లో నిషేధించబడిన సమాచారం వుండకూడదు.
క్రింది ఉదాహరణలు నిషేదించబడినవి :
Adult content
Content that advocates against an individual, group, or organization
Copyrighted material
Drug, alcohol, and tobacco-related content
Hacking and cracking content
Sites that offer compensation programs ("pay-to" sites)
Sites that use Google Brand features
Violent content
Weapon-related content
Other illegal content.

Google AdSense కు సంబంధించిన పూర్తి వివరాలు మరియు నిబంధనలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

1/4/15

how to earn money online without any investment

ఇంటర్నెట్ ద్వారా పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించడం ఎలా?

How to earn money online without investment
ఇంటర్నెట్  ద్వారా  పెట్టుబడి  లేకుండా చట్టపరంగా  డబ్బులు సంపాదించడం ఎలా? (how to earn money online without any investment and legal way). ఇంటర్నెట్ ద్వారా పెట్టుబడి లేకుండా చట్టప రంగా డబ్బులు సంపాదించే మార్గాలలో ముఖ్యమైన పద్దతులను కొన్నిటిని ఇక్కడ మీరు చూడవచ్చు.  (గమనిక:  మీ కంప్యూటర్ లో  Windows XP install  అయి వుండి తెలుగు అక్షరాలు కనిపించకపోతే  icomplex అనే software ని install చేయండి.  తరువాత మీరు తెలుగు అక్షరాలను స్పష్టంగా చూడగలుగుతారు. ఈ సాఫ్ట్ వేర్ ను గూగుల్ వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును.) వార్తా పత్రికలలో్ను, వెబ్ సైట్లలోను  'వర్క్ ఫ్రం హోం' ప్రకటనలు చూసి మోసపోవద్దు. వాళ్లను నమ్మి మీ విలువైన కాలాన్ని, డబ్బును వృధా చేసుకోవద్దు. ఇంటర్నెట్ ద్వారా పెట్టుబడి లేకుండా చట్టపరంగా డబ్బులు సంపాదించే మార్గాలలో ముఖ్యమైన పద్దతులను కొన్నిటిని ఇక్కడ మీరు చూడవచ్చు.

ఇంటర్నెట్ ద్వారా పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించే మార్గాలు :
1. ఫ్రీలాంసింగ్ జాబ్స్(freelance jobs): మీ తీరిక సమయంలో ఇంటివద్ద నుంచే పని చేసుకోగలిగే సదుపాయాన్ని కల్పించే ఉద్యోగాన్ని freelancing జాబ్ అంటారు. కొన్ని కంపెనీలు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ను పూర్తి చేయించుకొనుట కొరకు కొన్ని వెబ్ సైట్ల (market place) ద్వారా ఉపాధి అవకాశాలను అందిస్తుంటారు. ఆ వెబ్ సైట్లలో మనం రిజిస్టర్ అయి, మన విధ్యార్హతకు సంబంధించిన జాబ్స్ ను వెతికి, అప్లై చేసి, ఆ జాబ్స్ ను పొందవచ్చును. ఈ జాబ్స్ ను పార్ట్ టైం లేదా ఫుల్ టైం గానూ మీకు అనువుగా వుండే సమయంలో చేసుకోవచ్చును. ఫ్రీలాంసింగ్ జాబ్స్ మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చే యండి.

2. గూగుల్ AdSense: గూగుల్ వాళ్ళు ఇచ్చిన వ్యాపార ప్రకటనలను  మీ వెబ్ సైట్ లో డిస్ ప్లే  చేయడం  ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చును. ఈ విధానం లో మీరు డబ్బులు సంపాదించాలంటే మీకు సొంతంగా ఒక బెబ్ సైట్ వుండాలి. గూగుల్ AdSense మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

3. యూట్యూబ్ లో వీడియోలను అప్లోడ్  చేయడం: ఏదైనా టెక్నాలజీ కి సంబంధించి గాని, స్పోర్ట్స్, మ్యూజిక్, గేంస్ (games), షార్ట్ ఫిలింస్ కి సంబంధించి  మీరు సొంతంగా రికార్డ్ చేసిన వీడియోలను  యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తరువాత, మీ గూగుల్ AdSense అకౌంట్ ను యూట్యూబ్ అకౌంట్ కి అనుసంధానం  చేయడం  ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చును. మీరు upload చేసిన వీడియోలను వేరే ఎవరైనా చూసినపుడు మధ్య మధ్యలో వ్యాపార ప్రకటనలను ప్రదర్శించడం జరుగుతుంది. దానివల్ల యూట్యూబ్ కు వ్యాపార సంస్థలు డబ్బులు చెల్లిస్తాయి. దానిలోనుండి కొంత మొత్తాన్ని వీడియోలను అప్లోడ్ చేసిన వారికి చెల్లిస్తారు, అంటే మీకు చెల్లించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చే యండి.

4. Online లో ట్యూషన్లు చెప్పడం: మీరు ఏదైనా టెక్నాలజీ లేదా Maths లాంటి ఇతర సబ్జెక్ట్ లలో మంచి పట్టు వుంటే online లో ట్యూషన్లు చెప్తూ మంచి డబ్బులు సంపాదించవచ్చును. మీరు మీ ట్యూషన్లకు సంబంధించి ఫ్రీ క్లాసిఫైడ్స్ లో యాడ్స్ ఇవ్వడం ద్వారా ఉత్సాహవంతులైన అభ్యర్ధులు మీ యాడ్స్ ను చూసి, మిమ్మల్ని సంప్రదించి మీ కోర్స్ లో చేరడం జరుగుతుంది.  తద్వారా మీకు మంచి ఆదాయం వస్తుంది. మీరు ఒక ఫ్రీ వెబ్ సైట్ గాని బ్లాగ్ గాని తయారు చేసుకొని, ఆ సైట్ లో మీ ట్యూషన్లు గురించి ప్రకటనలను ఇస్తూ ఇంకా ఎక్కువ మంది విద్యార్ధులను మీ కోర్స్ లో చేర్పించుకోవచ్చును.  

5. Sell Website Templates Online: Website Templates కు మర్కెట్ లో చాలా డిమాండ్ వుంది. మీరు టెంప్లేట్ డిజైనింగ్ లో ఎక్స్పర్ట్ అయివుంటే, సొంతంగా టెంప్లేట్స్ ను తయారు చేసి ఇంటెర్నెట్ ద్వారా అమ్మి మంచి డబ్బులు సంపాదించవచ్చు. వెబ్ సైట్ టెంప్లేట్స్ లేదా థీంస్ (templates or themes) లలో పాప్యులర్ అయినవి: HTML Templates, Wordpress Themes, Photoshop Templates, Flash Templates and Joomla Templates. మీరు పైన తెలిపిన వాటిలో ఏవైనా వెబ్ సైట్ టెంప్లేట్స్ ను మంచి ఆకర్షణీయంగా తయారు చేసిన తరువాత క్రింద తెలిపిన వెబ్ సైట్ల ద్వారా మీరు వాటిని అమ్ముకోవచ్చును.
themeforest.net
graphicriver.net
fantero.com
templamatic.com
graphicleftovers.com
talkfreelance.com
coswap.com
inkd.com
flashden.net
activeden.net

పైన తెలిపిన వెబ్ సైట్లలో రిజిస్టర్ అయి మీ టెంప్లేట్స్ ను అప్లోడ్ చేసిన తరువాత కొంతమంది వ్యక్తులు మరియు కంపెనీలు మీ టెంప్లేట్స్ ను కొన్నపుడు, ఆ మొత్తంలో నుంచి మీకు కొంత డబ్బు చెల్లిస్తారు. ఈ విధానంలో మీకు చెల్లించే మొత్తం సుమారుగా 25 శాతం నుంచి 75 శాతం వరకు వుంటుంది. అదే విధంగా android మొబైల్స్ కు సంబంధించిన apps ను డెవలప్ చేసి మరియు వెబ్ సైట్ లోగోలను (logo) కూడా తయారుచేసి ఇంటెర్నెట్ ద్వారా అమ్మి మంచి ఆదాయాన్ని పొందవచ్చును.



Labels