BREAKING NEWS
Showing posts with label news. Show all posts
Showing posts with label news. Show all posts

3/10/15

How To Get Rid Of Lizards With Home Remedies

How To Get Rid Of Lizards With Home Remedies
How To Get Rid Of Lizards With Home Remedies
బల్లులను ఇంట్లోనుంచి తరిమికొట్టడం, ఇంట్లోకి రాకుండా అదుపుచేయడం ఎలా? The Simple Remedies To Prevent or Get Rid Of Lizards From Home.  బల్లులు మన ఇంటిలోని దోమలను, చిన్న చిన్న కీటకాలను చంపి మనకు మేలు చేస్తున్నప్పటికీ ఇంట్లోకి వచ్చి తరచూ చిరాకు కలిగిస్తూ వుంటాయి మరియు పిల్లలు వాటిని చూసి భయపడుతూ వుంటారు.  మనం ఆహ్వానించని ఈ అతిథులను ఇంట్లోనుంచి పారద్రోలటానికి, మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించకుండా అదుపుచేయటానికి కొన్ని Lizard repellents మార్కెట్లో దొరుకుతాయి.  కానీ వీటిలో అనేక హానికరమైన రసాయనాలు కలపడం వలన, వీటిని ఉపయోగించడం అంత శ్రేయష్కరం కాదు.  బల్లులను అదుపుచేయటానికి ఎటువంటి హాని లేని   చక్కటి చిట్కాలను (home remedies to get rid of lizards) ఈ క్రింద వివరించబడినవి. 

1. వెల్లుల్లితో చిట్కా:

వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి బల్లులు ఇంట్లోకి ప్రవేశించే మార్గంలోను, అవి తిరిగే ప్రదేశాలలోను ఉంచడం వలన వెల్లుల్లి ఘాటైన వాసనకు బల్లులు ఇంట్లోకి ప్రవేశించవు.
లేదా
ఒక స్ప్రే బాటిల్ (spray bottle) లో కొంచెం ఉల్లి (నీరుల్లి) రసం, కొంచెం నీరు పోసి ఈ మిశ్రమానికి వెల్లుల్లి రసం కొన్ని చుక్కలు కలిపి ఇంట్లోని మూలల్లో స్ప్రే చేయండి. ఈ వాసనకు బల్లులు ఇంట్లోనుంచి బయటకు పారిపోతాయి.  లేదా నీరుల్లి పాయలను రెండు ముక్కలుగా కోసి బల్లులు ఇంట్లోకి ప్రవేశించే చోట ఉంచినట్లైతే, ఆ వాసనకు బల్లులు ఇంట్లోకి ప్రవేశించవు.

2. చల్లని ఐస్ నీళ్ళుతో చిట్కా:

ఇంట్లో ఉండే బల్లులను పట్టి బయట పడివేయాలంటే అవి మన చేతికి దొరకడం కష్టం.  ఈ క్రింది చిట్కా ద్వారా బల్లులను సులువుగా పట్టుకొని బయట పారవేయవచ్చు.
బాగా చల్లగా ఉండే నీళ్ళను బల్లిపై చల్లండి.  దీని వల్ల బల్లి శరీర ఉష్ఠోగ్రత బాగా తగ్గి కొంత సమయం వరకు కదలలేదు.  వెంటనే దానిని చీపురు, చాట లేదా అట్ట పెట్టె సహాయంతో బల్లిని పట్టుకొని బయట పారవేయాలి.

3. కాఫీ పౌడర్ తో చిట్కా:

కొంచెం కాఫీ పౌడర్ మరియు కొంచెం పొగాకు పౌడర్ ను తీసుకొని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా తయారు చేయాలి.  ఈ ఉండలను బల్లులు ఇంట్లోకి వచ్చే మార్గాలలోను, అవి దాక్కొనే రహస్య ప్రదేశాలలోను ఉంచండి.  ఈ ఉండలను బల్లులు తినడం వలన అవి చనిపోతాయి.

4. నెమలి ఫించంతో చిట్కా:

నెమలి ఫించాలను చూసి బల్లులు బయపడతాయి.  నెమలి ఫించాలను ఇంట్లోని గోడలపై అక్కడక్కడ ఉంచడం మరియు ఫ్లవర్ వేస్ లో ఉంచడం వలన బల్లులు ఇంట్లోకి రావటాన్ని అదుపుచేయవచ్చును.

5. నాఫ్తలీన్ బాల్స్ (Naphthalene Balls) తో చిట్కా:

బల్లులను అదుపుచేయటానికి నాఫ్తలీన్ బాల్స్ చక్కగా పనిచేస్తాయి.  నాఫ్తలీన్ బాల్స్ ను stove కింద మరియు బల్లులు తిరిగే ప్రదేశాలలో ఉంచడం వలన ఆ వాసనకు బల్లులు ఇంట్లోనుంచి పారిపోతాయి.

6. మిరియాల పొడితో చిట్కా:

కొంచెం మిరియాల పొడిలో నీరు కలిపితే మంచి స్ప్రే తయారవుతుంది. ఈ స్ప్రే ను ఇంట్లోని అన్ని మూలల్లోను చల్లితే దాని ఘాటైన వాసన మరియు పవర్ కు బల్లులకు చిరాకు కలిగి బయటకు పారిపోతాయి.

7.  పిల్లిని చూసి బల్లులు భయపడతాయి. పిల్లులు చాలా ఇష్టంగా బల్లులను చంపి తింటాయి.  మీ ఇంట్లో పెంపుడు పిల్లి ఉన్నట్లైతే బల్లుల గురించి మీరు భయపడనవసరం లేదు.

8. కోడి గుడ్లను పగులగొట్టి ఆమ్లెట్ చేసిన తరువాత, గుడ్డు పెంకులను బల్లులు ఇంట్లోకి ప్రవేశించే మార్గాలలో ఉంచండి.  వీటిని చూసి బల్లులు భయపడి ఇంట్లోకి రావు.

పైన తెలిపిన చిట్కాలతో పాటు ముఖ్యంగా మీ ఇంటిని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం చాలా అవసరం.  అలాగే మీ ఇంటి తలుపులకు, కిటికీ తలుపులకు కన్నాలు ఉంటే రాత్రి వేళల్లో వాటిని కప్పి ఉంచండి.  పైన తెలిపిన 8 చిట్కాలలో రెండు, మూడు చిట్కాలను ఒకేసారి పాటించడం ద్వారా బల్లులను ఇంట్లొనుంచి బయటకు తరిమికొట్టవచ్చును మరియు తిరిగి ఇంట్లోకి రాకుండా నియంత్రించవచ్చును.

2/10/15

Delhi Assembly Elections 2015 Results

Delhi Assembly Elections 2015 Results
2015 Delhi Assembly Elections లో భారత ప్రజాస్వామ్య చరిత్రలో 'ఆం ఆద్మీ పార్టీ' చారిత్రక విజయం సాధించింది.  ఫిబ్రవరి 7, 2015 ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 70 శాసనసభ స్థానాలకు గాను 'ఆం ఆద్మీ పార్టీ' (AAP) 67 శాసనసభ స్థానాల్లో ఊహించని ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.  కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేవలం 3 శాసనసభ స్థానాలకు పరిమితమైంది.  గత 15 సంవత్సరాలు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు.  2013 డిశంబర్ లో జరిగిన Delhi Assembly Elections లో ఆప్ - 28 అసెంబ్లీ స్థానాలు, బి.జె.పి. 31 స్థానాలు, కంగ్రెస్ - 8 స్థానాలు, ఇతరులు - 3 స్థానాలు గెలుచుకోగా, ఈ సారి 2015 Delhi Assembly Elections లో ఫిబ్రవరి 10 న వెలువడిన Results ఈ విధంగా ఉన్నాయి.

ఢిల్లీ శాసనసభ మొత్తం స్థానాలు: 70

AAP విజయం సాధించిన స్థానాలు: 67
BJP విజయం సాధించిన స్థానాలు: 03
Congress విజయం సాధించిన స్థానాలు: 00
Others విజయం సాధించిన స్థానాలు: 00



ఈ ఫలితాల పట్ల AAP కన్వీనర్ Arvind Kejriwal హర్షం వ్యక్తం చేస్తూ, ఇది సామాన్యుడి విజయం అని పేర్కొన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సామాజిక వేత్త అన్నా హజారే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపారు.  ఫిబ్రవరి 14, 2015 న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Arvind Kejriwal An Inspiration of Common Man

Arvind Kejriwal - The Power of Common Man
ఢిల్లీ ఎన్నికల్లో 'ఆం ఆద్మీ పార్టీ' (AAP) ఘన విజయం.
దేశవ్యాప్తంగా బి.జె.పి. శ్రేణుల్లో అంతర్మధనం
ఢిల్లీలో ఓటమిని ఒప్పుకొన్న బి.జె.పి..
'ఆప్' కు కలిసొచ్చిన బి.జె.పి. వ్యతిరేక ఓటు.
మినీ ఇండియాగా భావించే ఢిల్లీ శాసనసభ 2015 ఎన్నికల్లో సత్తా చూపిన సామాన్యుడు.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని 'ఆం ఆద్మీ పార్టీ' (AAP) ఘన విజయం సాధించింది.
70 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో ప్రధానంగా AAP మరియు BJP పార్టీల మధ్య  హోరాహోరీ పోటీ జరిగింది.  అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి AAP ఘన విజయం సాధించడం 'దేశ రాజకీయాలలో విప్లవం మొదలైంది' అని ట్విటర్ లో కేజ్రీవాల్ అన్నారు.
ఆదర్శవంతమైన ఎన్నికలు అని, BJP వ్యతిరేకులకు AAP ఆశాజ్యోతిగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఢిల్లీ రాష్త్ర మొత్తం శాసనసభ స్థానాలు: 70

AAP ఆధిక్యంలో ఉన్న స్థానాలు: 65

BJP ఆధిక్యంలో ఉన్న స్థానాలు: 04

Congress ఆధిక్యంలో ఉన్న స్థానాలు: 00

Others ఆధిక్యంలో ఉన్న స్థానాలు: 01


Arvind Kejriwal కు అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.  హక్కుల కోసం కేజ్రీవాల్ పోరాడతారని ఢిల్లీ ప్రజలు భావించారని ప్రముఖ సామాజికవేత్త 'అన్నా హజారే' అభిప్రాయ పడ్డారు.  ఒక common man ఇంత ఘనవిజయం సాధించండం చాలా గొప్ప విషయం అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.  ఇంకా ఈ ఓట్ల లెక్కింపులో అంతిమ ఫలితాలు వెలువడాల్సి ఉంది.