BREAKING NEWS

2/8/15

Give Up Superstition Quotes in Telugu

మూఢవిశ్వాసాలను త్యజించండి! మోసగాళ్ళు, వంచకుల ప్రభావంతో జనం మూఢనమ్మకం అనే నిత్య శత్రువును పెంచి పోషిస్తూ జీవితంలో దేనిని సాధించలేకపోతున్నారు.  వెనుకబాటు తనానికి మూలకారణాలలో మొదటిది ఈ మూఢనమ్మకమే.  Give Up Superstition Quotes in Telugu పేజీని చదివాక వాస్తవాలను గ్రహించి, వాటిని ఆచరించే ప్రయత్నం చేయండి.  టెక్నాలజీలో మనం శరవేగంగా దూసుకుపోతున్న ఈ తరుణంలో కూడా ఏమిటీ దుస్థితి.  కొందరు విద్యావంతులు, పండితులు కుడా దీనిని ప్రోత్సహించడం ఒక విధమైన మోసపూరిత చర్యగా పరిగణింపవచ్చు.  మూఢనమ్మకాలు చాలా దేశాలలో ఉన్నప్పటికీ, మన భారతదేశంలో అధికంగా ఉండటం దేశ అభివృద్ధికి పెద్ద ఆటంకం అని చెప్పవచ్చు.  మూఢనమ్మకాలను పాటించడం వలన ఎటువంటి ఫలితం ఉండకపోగా ధనం, కాలం వృధా అవుతుందిని ప్రతి ఒక్కరూ తెలుసుకొన్న నాడు దేశ అభివృద్ధి పరుగులు పెడుతుందనడంలో సందేహం లేదు.  ప్రతిదానినీ గ్రుడ్డిగా నమ్మేవాడికన్నా,  తన విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి నమ్మకం లేని వాడిగా ఉన్న మనిషిని భగవంతుడు క్షమిస్తాడు.

"మూఢనమ్మకాన్ని అంటువ్యాధిగా భావించి నిర్మూలించు.
అది మీ అభివృద్ధికి అన్ని విధాలా దోహదపడుతుంది. "

"మీరంతా నాస్తికులుగా మారిపోయినా ఫరవాలేదుగాని,
మూఢాచారాలతో మూర్ఖులై పోవడం మాత్రము తగదు.
నాస్తికుడు అయినప్పటికీ వాని వల్ల కొంతైనా ప్రయోజనం నెరవేరదు.
కాని మూఢాచారం ప్రవేశిస్తే మెదడు ధ్వంసమైపోయినట్లే!
బలహీనమైనట్లే! జీవితం భ్రష్టమైపోయినట్లే! "

"మోసగాళ్ళు, వంచకుల ప్రభావంలో పడటంకన్నా మీరు నాస్తికులై
మరణించడం మేలు.  ఉపయోగించడానికి మీకు విచక్షణా జ్ఞానం ఇవ్వబడింది.
ఆ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించినట్లు నిరూపించండి. "

"మనిషికి మూఢవిశ్వాసం ఒక ప్రబల శత్రువు. "

"తనకున్న ప్రజ్ఞను ఉపయోగించకుండా ప్రతిదానినీ గ్రుడ్డిగా నమ్మేవాడికన్నా,
తన విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి నమ్మకం లేని వాడిగా ఉన్న మనిషిని
భగవంతుడు క్షమిస్తాడు. "

"పురాతన గ్రంథాలలో ఉందనిగాని, మీ తాతముత్తాతలనిండి సంక్రమించిందనిగాని,
మీ స్నేహితులు కోరుతున్నరని గాని మీరు దేనిని నమ్మవద్దు.  మీ అంతట
మీరే ఆలోచించుకొని, సత్యాన్ని స్వయంగా అన్వేషించండి.  మందమతులు,
బలహీన మనస్కులు, పిరికివారు సత్యాన్ని దర్శింపలేరు. "

"మిమ్మల్ని బలహీనులుగా చేసే సమస్త విషయాలను పరిత్యజించండి.
వాటితో మీకు సంబంధం లేదు.  రహస్య సాధనతో కూడుకున్న
క్షుద్ర విద్యల వల్ల మానవ మేధ బలహీనమవుతుంది. "

"దివ్యమై, శక్తి ప్రదమై, తేజోవంతములై ఉన్న మీ ఉపనిషత్తులను ఆశ్రయించండి.
మిమ్మల్ని దుర్బలురను చేసే రహస్య, మార్మికమైన విషయాల నుండి వైదొలగండి. "

"నిరాశ, నిస్పృహ అనేవి ఏమైనా కావచ్చు కాని మతం మాత్రం కాదు.
ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఆనందంతో ఉండడం అనేది ప్రార్థన కంటే కూడా
మరింత దగ్గరగా భగవంతుని సాన్నిధ్యం పొందడానికి దోహదపడుతుంది. "

"నిరుత్సాహులై, అధైర్యపడేవారు జీవితంలో ఏ పనినీ సాధించలేరు.
రోదిస్తూ, దు:ఖిస్తూ జనన మరణముల పాలవుతారు. "

"సమస్త దౌర్బల్యం, సమస్త బంధం కేవలం మన:కల్పనయే.
దౌర్భల్యాన్ని విడనాడు. లే! దృఢంగా ఉండు. నాకు తెలిసిన మతమిదే. "

"అనంత శక్తే మతం. అదే దైవం. "

"మనకు కావలసింది బలం.  మనకు బలాన్ని ఎవరిస్తారు?
ఇపనిషత్తులు బలానికి అపార నిధులై ఉన్నాయి.
ఉపనిషత్తుల ద్వారా లోకమంతా జీవశక్తిని, బలాన్ని, ఓజస్సును పొందగలుగుతుంది. "

"బలాన్ని సంపాదించడానికి మొదటి సాధనం నేను ఆత్మను - అని విశ్వసించడమే.
నన్ను ఖడ్గం చేదించలేదు, ఆయుధాలు ఛిద్రం చేయలేవు, అగ్ని దహించలేదు,
గాలి శోషింప చేయలేదు. నేను సర్వశక్తిమంతుణ్ణి, అనే ధన్యవాక్యాలను ఉచ్చరించి బలవంతులు కండి. "
Give Up Superstition Quotes By Swami Vivekananda

Post a Comment