BREAKING NEWS

2/7/15

Way To Success Quotes in Telugu

way to success quotes in telugu
విజయానికి మార్గం: మనిషి తను ఎన్నుకొన్న రంగంలో విజయం సాధించాలనే తపనలో ఉంటాడు.  అందుకై ఎన్నో అవరొధాలను ఎదుర్కొనవలసి ఉంటుంది. అటువంటి అవరోధాలను అధిగమించడానికి ఈ way to success quotes ఎంతగానో ఉపయోగపడతాయి.  మానవుని జీవన పయనంలో అపజయాలను లక్ష్యపెట్టక, 'విజయసాధన' అనే పోరాటానికి సంసిద్ధం చేసేవే Success Quotes.  అపజయాల నీడలోనే విజయం దాగివుంటుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

"మన తప్పులకు కూడా ఇక్కడ చోటు ఉంది.  ముందుకు సాగిపోండి!
ఒకవేళ ఏదైనా తప్పు చేశామని మీరు భావించినా వెనక్కు చూడకండి.
మీరు ఆ తప్పులు చేయని పక్షంలో ఇప్పుడు ఈ విధంగా ఉండేవారా?
కాబట్టి మీ తప్పులను దీవించండి, అవి అదృశ్య దేవతలు.
లక్ష్యాన్ని అంటిపెట్టుకొని ముందుకు సాగిపో!"

"నేను జీవితం లో అనేక తప్పులను చేశాను.  కాని ఆ తప్పులలో ఏది లేకున్నా,
నేను ఈ స్థితికి వచ్చివుండకపోయేవాణ్ణి అనడం నిస్సంశయం.
కాబట్టి వాటికి నేను కృతజ్ఞుణ్ణి.  అలాగని మిమ్మల్ని బుద్ధిపూర్వకంగా
తప్పులను చేయమని చెప్పడంలేదు.  కాని తప్పులను చేస్తే విలపించకు."

"జరుగవలసింది ఏదో జరిగిపోయింది, చింతించకు.
జరిగిపోయిన కార్యాలను గూర్చి పదే పదే తలపోయకు.
వాటిని నీవు రద్దు చేయలేవు, కర్మఫలం కలిగే తీరుతుంది.
దానిని ఎదుర్కో! కాని చేసిన తప్పునే మరల చేయకుండా జాగ్రత్త వహించు."

"ఇతరుల దోషాల గురించి, వారెంత దుష్టులైనా సరే ఎన్నడూ ముచ్చటించకు.
తద్వారా ఏ మేలు కలుగదు.  అటువంటి పనుల వల్ల
నీవు అతనికి హాని చేసి, నీకు నీవే హాని చేసుకుంటావు."

"అపజయాలను లక్ష్యపెట్టకు.  అవి వాటిల్లడం సహజం.  ఈ అపజయాలు
జీవితానికి అలంకారప్రాయాలు.  పోరాటానికి సంసిద్ధం చేసేవి ఈ అపజయాలే!
ఆవు అసత్యమాడదు నిజమే. కాని అది ఎప్పటికీ ఆవే! మనిషి కాలేదు.
వెయ్యిసార్లు ఓటమి వాటిల్లినా, లక్ష్యసిద్ధికై ఇంకొకసారి మళ్ళీ ప్రయత్నించండి."

"వేల అవరోధాలను అధిగమించినప్పుడే
సౌశీల్య నిర్మాణం సాధ్యమౌతుంది."

"జీవన పయనంలో ఒకరి తొట్రుపాటు ఎక్కువగాను, ఒకరిది తక్కువ గాను ఉంటుంది.
తక్కువ అయితే సజ్జనుడనీ, ఎక్కువ అయితే దుర్జనుడనీ అంటారు.
కాని ఆ రెండూ ఒక్కటే! కనిపించడంలో గల ఎక్కువ తక్కువలకే ఆ పేర్లు."

"Way To Success Quotes in Telugu" By Swami Vivekananda.

Post a Comment