BREAKING NEWS

2/7/15

Organizational Leadership Quotes in Telugu

Organizational Leadership Quotes in Telugu
Organizational Leadership Quotes in Telugu

సంస్థాగత నాయకత్వ లక్షణాలను పెపొందించుకొంటే, గొప్ప 'నాయకుడు' అనిపించుకుంటారు.  స్వామి వివేకానంద చెప్పిన ఈ Best Collection of Organizational Leadership Quotes in Telugu ను యదార్ధ దృష్టితో అర్ధం చేసుకొని, ఆ ప్రకారంగా మీరు కార్యోన్ముఖులవ్వండి.  స్వామీజీ ఒకసారి ఇలా అన్నారు: నా ఆశ, విశ్వాసము మీ వంటివారి మీదనే ఉన్నాయి.  మీకు కావలసినంత సలహా ఇచ్చాను.  కొంచెమైనా ఇప్ప్పుడు ఆచరణలో పెట్టండి.  నా మాటలు వినడం ఉపయోగ కరమైనదని లోకానికి తెలియజేయండి."


"విశ్వాసం, సౌశీల్యం గల కొద్దిమంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. మనకు
కావలసినవి మూడు - ప్రేమించే హృదయం, భావించే మనస్సు, పని చేసే చెయ్యి."

"మిమ్మల్ని ఒక శక్తి జనక యంత్రంగా తయారుచేసుకోండి.  మీరు పవిత్రులు,
శక్తిమంతులు అయితే మీరొక్కరే ప్రపంచం మొత్తానికి సరితూగగలరు."

"ప్రేమ, మంచితనం, పరిత్రత మనలో ఎంత అభివృద్ధి చెందితే...
బయట ప్రపంచంలో అంత ప్రేమ, మంచితనం, పరిత్రత మనకు కనబడతాయి.
పరదూషణ నిజానికి ఆత్మదూషణే.  మిమ్మల్ని మీరు సరిదిద్దుకొంటే,
ప్రపంచం తనంతట తానే మీకై సరికాగలదు."

"అఖండమైన ఉత్సాహం, అపరిమితమైన ధైర్యం, అప్రతిహతమైన శక్తి...
అన్నింటినీ మించి పరిపూర్ణ విధేయత - ఈ లక్షణాలే
ఒక వ్యక్తినిగాని, ఒక దేశాన్నిగాని పునరుజ్జీవింప చేయగలవు."

"నాయకత్వాన్ని వహించేటప్పుడు సేవకుడిగా ఉండండి.  నిస్వార్ధంగా ఉండండి.
అనంత సహనం కలిగి ఉండండి.  అప్పుడు విజయం మీదే."

"మీరందరు స్వలాభాన్ని, వర్గ కీచులాటలను, అసూయను విడిచిపెట్టండి.
భూమాతవలె ఓర్మి కలిగి ఉంటే, లోకమే మీకు పాదాక్రాంతమౌతుంది."

"విమర్శించడం విడిచిపెట్టండి.  ఎదుటివారు చేసే పని మంచిదైతే మీకు చేతనైన
సహాయం చేయండి.  వారు తప్పు ద్రోవ పడుతున్నారనిపిస్తే వారి తప్పులను
సున్నితంగా తెలియజేయండి.  ఒకరినొకరు తప్పు పట్టుకోవడమే అన్ని అనర్ధాలకు మూలం."

"సంఘటితంగా పనిచేయడం కావాలి.  నీవు నన్ను అర్ధంచేసుకుంటావా?
మీకెవరికైనా బుర్రలో ఈ పాటి మేధశక్తి ఉందా? ఉంటే మీ మనస్సును పనిచేయనివ్వండి."

"నిస్వార్ధంగా పని చేయండి.  మరొకరిని చాటున
దూషిస్తున్న మిత్రుని మాటలను ఎన్నడూ వినవద్దు."

"కపటం, దుర్మార్గం ఎంత మాత్రం ఉండకూడదు.
అల్పశ్వాస పాటి అనైతికత, నలుసంత చెడు విధానం కూడా తగవు."

These "Organizational Leadership Quotes in Telugu" are the great victory signs of Swami Vivekananda.

Post a Comment