BREAKING NEWS

2/9/15

Quotes on Education in Telugu

Quotes on Education in Telugu
Quotes on Education in Telugu: విద్య - ప్రపంచాన్ని మార్చగలిగే ఒక శక్తివంతమైన ఆయుధం. అయితే, విద్య అనేది జీవితకాలం పాటూ అర్ధంకాకుండా మనసును కల్లోలపరిచే సమాచారం కాదు.  విద్య అంటే  సమర్ధమైన భావాలు.  ఇటువంటి భావాలను గ్రహించి మీ జీవితంగా, వ్యక్తిత్వంగా మలచుకోవడమే నిజమైన విద్య.

"విద్య అంటే మీ మెదడులో దట్టింపబడి జీవితకాలం పాటూ అర్ధంకాకుండా
మనసును కల్లోలపరిచే సమాచారం కాదు.  విద్య అంటే ఉజ్జీవనకరం, సమర్ధమైన భావాలు.
ఇటువంటి భావాలను గ్రహించి మీ జీవితంగా, వ్యక్తిత్వంగా మలచుకోవడమే నిజమైన విద్య."

"మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి.
బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి."

"బలహీనతకు విరుగుడు బలం గురించి ఆలోచించడమే కానీ
బలహీనతను చింతంచడం కాదు.  తమలోనే అంతర్గతంగా
ఉన్న శక్తి గురించి జనులందరికీ ప్రబోధించండి."

"ఆత్మకు అసాధ్యమైనది ఏదైనా కలదని ఎన్నడూ తలచకండి.
అలా భావించడం గొప్ప అపచారమే.  పాపం అనేది ఏదైనా ఉంటే
అది - మీరు దుర్బలురని లేదా ఇతరులను బలహీనులని పలకడమే!"

"మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచన, పలుకు మాత్రమే ఈ లోకం లో ఉన్న
కీడు అని గ్రహించండి.  మనిషిని బలహీనపరిచే, మనిషికి భయాన్ని
కలిగించే దానిని మాత్రమే చెడుగా భావించి తిరస్కరించాలి."

"మిమ్మల్ని మీరు బలహీనులుగా
భావించుకోవడమే గొప్పపాపం."

"మీరు దీనిని చక్కగా గ్రహించాలని నా ప్రార్థన - తాను వ్యర్ధుడనని మననం చేసే వ్యక్తి వల్ల
ఎటువంటి శుభమూ చేకూరదు.  మనిషి  రేయింబవళ్ళు తాను దు:ఖితుడనని, అధముడనని,
 పనికిమాలిన వాడినని భావించడం వల్ల, అతడు పనికిమాలిన వాడే అయిపోతాడు.
ఈ మహాసత్యాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి."

"ఒక వ్యక్తితో నువ్వు అధముడవు, దుష్టుడవు అని పదే పదే చెప్పడం వలన
క్రమంగా ఆ వ్యక్తి తాను నిజంగా అలాంటివాడినే అని నమ్ముతాడు."

"ఇంకొకరిని పాపి అని అనడమే
మీరు చేసే పెద్ద తప్పు."

"సింహాల్లారా రండి! మీరు గొర్రెలనే భ్రమ నుంచి బయటపడండి.
మీరు అమరులు, పవిత్రులు, శాశ్వతులు.  మీరు ప్రకృతి కాదు, శరీరం కాదు.
ప్రకృతే మీకు బానిస,  మీరు ప్రకృతికి బానిసలు కాదు."

"మనిషి పాపాత్ముడని అనవద్దు.
అతడొక దైవమని తెలియజేయండి."

"మనిషి అంత:స్వరూపం అగ్నిపర్వత విస్ఫోటనం కన్నా లక్షల రెట్లు శక్తివంతమైనది.
ఈ అంత:శక్తి బాహ్యప్రకృతి  ధర్మాలన్నింటినీ అధిగమిస్తుంది.
ఈ అంత:ప్రవృత్తే మనిషికి తాను ఏమిటో తెలుపుతుంది."

Quotes on Education in Telugu By Swami Vivekananda

Post a Comment