BREAKING NEWS

2/12/15

Telugu Quotes on Be Brave

Telugu-Quotes-on-Be-Brave
Telugu-Quotes-on-Be-Brave

"ఎవరైతే తన గురించి అతి జాగ్రత్త వహిస్తారో వారు అడుగడుగునా
అపాయాలకు లోనవుతారు.  గౌరవం, అభిమానం పోతాయని
భయపడుతూ ఉండేవారికి అవమానమే ప్రాప్తిస్తుంది.  సదా ఏదో
పోతుందని భయపడేవారు ఎప్పుడూ నష్టపోతారు."

"సత్యాన్ని, ప్రేమనూ ఎవ్వరూ అడ్డుకోలేరు.  మీలో సత్యం, ప్రేమ ఉందా?
నిస్వార్ధంగా ఉండగలరా? అయితే మీరు మృత్యువుకు కూడా భయపడకండి."

"ఎన్నడూ అధైర్యపడవద్దు! ఆహార వ్యవహారాలలో గాని, దుస్తుల విషయంలో గాని,
నిద్రించడంలో గాని, ఆటపాటలలో గాని, రోగ భోగాలలో గాని ఎల్లప్పుడూ
ఉత్తమమైన నైతికబలాన్ని ప్రదర్శించండి.  అప్పుడే మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది."

"ఒక్క అడుగు వెనక్కు వేయవద్దు, ఎలాంటి పరిస్థితి ఎదురైనా పోరాడండి.
ప్రపంచం మొత్తం మనకు ఎదురు నిలుచును గాక!  అయితే నేం? పోరాడండి!
పిరికివాళ్ళై, అడుగు వెనక్కివేసి మీరు సాధించేదేమీ ఉండదు."

"యువకులై, ఉత్సాహవంతులై, బుద్ధిమంతులై, ధీరులై మృత్యువును సైతం
పరిహసించగలిగి, సముద్రాన్నైనా ఎదురీదడానికి సంసిద్ధులై ముందుకు సాగండి."

"గొప్ప కార్యాలెప్పుడైనా తేలికగా సాధించబడ్డాయా? పిరికివాళ్ళలా ఉండడానికి వీల్లేదు.
ఉక్కు సంకల్పం, ప్రకంపించని హృదయాలు కలిగిన వారికి భగవంతుడు ఆశీర్వదించును."

"పిరికిపందలకు నేనేం సలహా ఇవ్వాలి? వాళ్ళకు నేను చెప్పేది ఏమీ లేదు.
నా ఉద్దేశంలో భయంతో ముడుచుకుపోయి, బానిస మనసుతో, గొణుగుతూ,
ప్రతీదీ కష్టంగా భావిస్తూ, పతనమొనర్చే 'అలసత్వం - నరకం' ఈ రెండూ ఒక్కటే!"
'Telugu Quotes on Be Brave' By Swami Vivekananda

Post a Comment