BREAKING NEWS

2/11/15

Quotes on Religion in Telugu


Quotes on Religion in Telugu

Quotes on Religion in Telugu

"మీలో ఉన్న దివ్యత్వాన్ని
అభివ్యక్తీకరించడమే మతం. "

"భగవంతునిపై నమ్మకం లేనివాడు నాస్తికుడని
పూర్వపు మతాలు భోధించాయి.  తనపై తనకు నమ్మకము
లేని వాడు నాస్తికుడని ఆధునిక మతం బోధిస్తున్నది. "

"ఆదర్శం గల వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే, ఏ ఆదర్శం లేని
వ్యక్తి ఏభై వేల తప్పులు చేస్తాడనడం నిస్సంశయం.
కాబట్టి ఒక ఆదర్శం కలిగివుండడం మంచిది. "

"అసత్యమైన దానికి దూరంగా ఉండు.  సత్యాన్ని
అంటిపెట్టుకొని ఉంటే విజయం సాధించగలం.
ఆలస్యమైనప్పటికీ విజయం సాధించే తీరతాం. "

"ఘనకార్యాలను సాధించడానికే భగవంతుడు మనల్ని
ఎన్నుకొన్నాడని విశ్వసించి, ఉత్సాహంగా ఉండండి.
మనం వాటిని సాధించే తీరుతాం. "

"కండబలం నిజానికి గొప్పదే, కండబల వ్యక్తీకరణలు గొప్పవే.
యంత్రాలు, విజ్ఞాన శాస్త్ర పరికరాల ద్వారా అభివ్యక్తీకరింపబడిన
బుద్ధిశక్తి కూడా గొప్పదే.  కాని ప్రపంచంపై ఆత్మశక్తి చూపే
ప్రభావం కన్నా ఇవేవీ శక్తివంతమైనవి కావు. "

"మిగతా యుగాలలో ఆచరించిన తపస్సులు, కష్టభూయిష్టాలైన యోగాలు
నేడు ఉపయోగపడవు.  ఈ యుగంలో ఆవశ్యకమైంది దానం, ఇతరులకు
సహాయపడటం.  దానం అంటే పారమార్ధిక జ్ఞానాన్ని, వ్యావహారిక జ్ఞాననాన్ని,
ప్రాణరక్షణ, అన్నపానీయాలను అందించడం.  ఆధ్యాత్మిక జ్ఞానాన్ని
ఇచ్చేవారు జీవుణ్ణి జననమరణ చక్రపరంపర నుండి రక్షించ గలరు. "

"కోరనూవద్దు, త్రోసిపుచ్చనూ వద్దు. లభించిన దానిని స్వీకరించు.
దేనివల్లా బాధించబడకుండా ఉండడమే స్వాతంత్ర్యం. "

"భారతదేశం, ప్రపంచానికి ఇచ్చే కానుక ఆధ్యాత్మిక జ్ఞానమే!
మన ఆధ్యాత్మిక భావాలు కంటికి కనపడక, చెవికి వినపడక,
తెల్లవారు జామున మెల్లమెల్లగా నేలకు జాలువారు మంచు
బిందువుల వలె ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్నాయి. "

"అహర్నిశలు ఇలా ప్రార్ధించు:
ఓ జగజ్జననీ, నాకు ధీరత్వాన్ని ప్రసాదించు!
ఓ శక్తిశాలినీ! నా బలహీనతలను, దౌర్బల్యాన్ని
తొలగించి నన్ను ధీరమానవునిగా చేయి! "

Quotes on Religion in Telugu by Swami Vivekananda

Post a Comment