BREAKING NEWS

1/8/15

how to earn money with google adsense

గూగుల్ AdSense ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

earn money with google adsense
గూగుల్  AdSense  అంటే  ఏమిటి?    గూగుల్  AdSense ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?  (What is Google AdSense and  how to earn money with  Google AdSense?)
గూగుల్ adsense అనేది వ్యాపార ప్రకటనలకు సంబంధించిన ఒక ప్రోగ్రాం. వివిధ వ్యాపార సంస్థల వారు తమ ప్రోడక్టు లేదా సర్వీసు యొక్క ప్రకటనలను వివిధ వెబ్ సైట్లలో ప్రదర్శించడానికి గూగుల్ ప్రతినిధులను సంప్రదించి  డబ్బులు చెల్లిస్తారు. ఈ ప్రోగ్రాంలో్ వివిధ రకాల వ్యాపార సంస్థల వారు ఇచ్చిన ప్రకటనలను ప్రైవేట్ వ్యక్తులకు సంబంధిన వివిధ వెబ్ సైట్లలో ప్రదర్శించడం (display) చేస్తారు. ఈ ప్రోగ్రాం నే గూగుల్ AdSense అంటారు. ఈ ప్రకటనలను ప్రదర్శించిన వెబ్ సైట్లను సందర్శ్హించిన ప్రేక్షకులు ఏదైనా ప్రకటన పై క్లిక్ చేస్తే, ఆ వెబ్ సైట్ యజమానికి గూగుల్ వాళ్ళు డబ్బులు చెల్లిస్తారు. (వ్యాపార సంస్థల వారు గూగుల్ కి చెల్లించిన సొమ్ములోనుంచి సుమారుగా 68 శాతం వరకు ఈ ప్రకటనలను ప్రదర్శించిన వెబ్ సైట్ యజమానికి చెల్లిస్తారు). ఒక వెబ్ సైట్లో వున్న కంటెంట్ ను ఆధారంగా ఈ యాడ్స్ ను ప్రదర్శిస్తారు. ఉదాహరణకు: ఒక వెబ్ సైట్లో మొబైల్స్ కు సంబంధించిన కంటెంట్ వుంటే, ఆ వెబ్ సైట్లో మొబైల్స్, మొబైల్ కవర్స్, మొబైల్ సాఫ్ట్ వేర్, మొబైల్ గేంస్, వివిధ మొబైల్ పరికరాలు, మొబైల్ ఇంటెర్నెట్ మరియు టెలికాం సర్వీసులకు సంబంధించిన యాడ్స్ ను ప్రదర్శిస్తారు.

ఇంటర్నెట్ ద్వారా పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించే వేరొక విధానం "Google AdSense". ఈ విధానం ద్వారా డబ్బులు సంపాదించాలంటే మీకు సొంతంగా ఒక వెబ్ సైట్ వుండాలి.  మీ వద్ద పెయిడ్ వెబ్ సైట్ (with hosting and domain registration) లేదా ఫ్రీ వెబ్ సైట్ తయారు చేసుకొని, మంచి కంటెంట్ పోస్ట్ చేసి, నెలకు సుమారుగా 300 మంది మీ వెబ్ సైట్ ను visit చేస్తూ వుంటే, మీరు "Google AdSense" కొరకు అప్లయ్ చేసుకోవచ్చు. మీ AdSense account ఆమోదం పొందిన  తరువాత గూగుల్ వాళ్ళు ఇచ్చిన యాడ్స్ ను మీ వెబ్ సైట్ లో display చేయడం ద్వారా మీరు మంచి ఆదాయం పొందవచ్చును. మీ వెబ్ సైట్ ను సందర్శ్హించే ప్రేక్షకులు (visitors) మరియు వెబ్ పేజీల  సంఖ్యను బట్టి మీ ఆదాయం వుంటుంది.  ఈ సంఖ్యను పెంచుకోవడం ద్వారా మీ ఆదాయం పెరుగుతుంది. మీ వెబ్ సైట్ లో నలుగురికీ ఉపయోగపడే unique content ను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ visitors ను పెంచుకుంటుంటే ఈ విధానం లో పరిమితి లేని ఆదాయం పొందవచ్చును.  గూగుల్ AdSense కొరకు అప్లయ్ చేసేందుకు క్రింది నిబంధనలు తప్పనిసరి.

1. గూగుల్ AdSense కొరకు అప్లయ్ చేసే వారి వయస్సు 18 సంవత్సరములు నిండి వుండాలి.
2. మీ వెబ్ సైట్ వయస్సు కనీసం ఆరు నెలలు కలిగి వుండాలి (అంటే మీ వెబ్ సైట్ తయారుచేసి /హోస్టింగ్ చేసిన ఆరు నెలలు తరువాత గూగుల్ AdSense కొరకు అప్లయ్ చేసుకోవలెను).
3. మీ వెబ్ సైట్లో డూప్లికేట్ సమాచారం వుండకూడదు (అంటే వేరే వెబ్ సైట్లో వున్న మాదిరిగా కాకుండా different గా వుండాలి).
4. మీ వెబ్ సైట్లో నిషేధించబడిన సమాచారం వుండకూడదు.
క్రింది ఉదాహరణలు నిషేదించబడినవి :
Adult content
Content that advocates against an individual, group, or organization
Copyrighted material
Drug, alcohol, and tobacco-related content
Hacking and cracking content
Sites that offer compensation programs ("pay-to" sites)
Sites that use Google Brand features
Violent content
Weapon-related content
Other illegal content.

Google AdSense కు సంబంధించిన పూర్తి వివరాలు మరియు నిబంధనలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.