BREAKING NEWS

1/4/15

how to earn money online without any investment

ఇంటర్నెట్ ద్వారా పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించడం ఎలా?

How to earn money online without investment
ఇంటర్నెట్  ద్వారా  పెట్టుబడి  లేకుండా చట్టపరంగా  డబ్బులు సంపాదించడం ఎలా? (how to earn money online without any investment and legal way). ఇంటర్నెట్ ద్వారా పెట్టుబడి లేకుండా చట్టప రంగా డబ్బులు సంపాదించే మార్గాలలో ముఖ్యమైన పద్దతులను కొన్నిటిని ఇక్కడ మీరు చూడవచ్చు.  (గమనిక:  మీ కంప్యూటర్ లో  Windows XP install  అయి వుండి తెలుగు అక్షరాలు కనిపించకపోతే  icomplex అనే software ని install చేయండి.  తరువాత మీరు తెలుగు అక్షరాలను స్పష్టంగా చూడగలుగుతారు. ఈ సాఫ్ట్ వేర్ ను గూగుల్ వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును.) వార్తా పత్రికలలో్ను, వెబ్ సైట్లలోను  'వర్క్ ఫ్రం హోం' ప్రకటనలు చూసి మోసపోవద్దు. వాళ్లను నమ్మి మీ విలువైన కాలాన్ని, డబ్బును వృధా చేసుకోవద్దు. ఇంటర్నెట్ ద్వారా పెట్టుబడి లేకుండా చట్టపరంగా డబ్బులు సంపాదించే మార్గాలలో ముఖ్యమైన పద్దతులను కొన్నిటిని ఇక్కడ మీరు చూడవచ్చు.

ఇంటర్నెట్ ద్వారా పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించే మార్గాలు :
1. ఫ్రీలాంసింగ్ జాబ్స్(freelance jobs): మీ తీరిక సమయంలో ఇంటివద్ద నుంచే పని చేసుకోగలిగే సదుపాయాన్ని కల్పించే ఉద్యోగాన్ని freelancing జాబ్ అంటారు. కొన్ని కంపెనీలు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ను పూర్తి చేయించుకొనుట కొరకు కొన్ని వెబ్ సైట్ల (market place) ద్వారా ఉపాధి అవకాశాలను అందిస్తుంటారు. ఆ వెబ్ సైట్లలో మనం రిజిస్టర్ అయి, మన విధ్యార్హతకు సంబంధించిన జాబ్స్ ను వెతికి, అప్లై చేసి, ఆ జాబ్స్ ను పొందవచ్చును. ఈ జాబ్స్ ను పార్ట్ టైం లేదా ఫుల్ టైం గానూ మీకు అనువుగా వుండే సమయంలో చేసుకోవచ్చును. ఫ్రీలాంసింగ్ జాబ్స్ మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చే యండి.

2. గూగుల్ AdSense: గూగుల్ వాళ్ళు ఇచ్చిన వ్యాపార ప్రకటనలను  మీ వెబ్ సైట్ లో డిస్ ప్లే  చేయడం  ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చును. ఈ విధానం లో మీరు డబ్బులు సంపాదించాలంటే మీకు సొంతంగా ఒక బెబ్ సైట్ వుండాలి. గూగుల్ AdSense మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

3. యూట్యూబ్ లో వీడియోలను అప్లోడ్  చేయడం: ఏదైనా టెక్నాలజీ కి సంబంధించి గాని, స్పోర్ట్స్, మ్యూజిక్, గేంస్ (games), షార్ట్ ఫిలింస్ కి సంబంధించి  మీరు సొంతంగా రికార్డ్ చేసిన వీడియోలను  యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తరువాత, మీ గూగుల్ AdSense అకౌంట్ ను యూట్యూబ్ అకౌంట్ కి అనుసంధానం  చేయడం  ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చును. మీరు upload చేసిన వీడియోలను వేరే ఎవరైనా చూసినపుడు మధ్య మధ్యలో వ్యాపార ప్రకటనలను ప్రదర్శించడం జరుగుతుంది. దానివల్ల యూట్యూబ్ కు వ్యాపార సంస్థలు డబ్బులు చెల్లిస్తాయి. దానిలోనుండి కొంత మొత్తాన్ని వీడియోలను అప్లోడ్ చేసిన వారికి చెల్లిస్తారు, అంటే మీకు చెల్లించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చే యండి.

4. Online లో ట్యూషన్లు చెప్పడం: మీరు ఏదైనా టెక్నాలజీ లేదా Maths లాంటి ఇతర సబ్జెక్ట్ లలో మంచి పట్టు వుంటే online లో ట్యూషన్లు చెప్తూ మంచి డబ్బులు సంపాదించవచ్చును. మీరు మీ ట్యూషన్లకు సంబంధించి ఫ్రీ క్లాసిఫైడ్స్ లో యాడ్స్ ఇవ్వడం ద్వారా ఉత్సాహవంతులైన అభ్యర్ధులు మీ యాడ్స్ ను చూసి, మిమ్మల్ని సంప్రదించి మీ కోర్స్ లో చేరడం జరుగుతుంది.  తద్వారా మీకు మంచి ఆదాయం వస్తుంది. మీరు ఒక ఫ్రీ వెబ్ సైట్ గాని బ్లాగ్ గాని తయారు చేసుకొని, ఆ సైట్ లో మీ ట్యూషన్లు గురించి ప్రకటనలను ఇస్తూ ఇంకా ఎక్కువ మంది విద్యార్ధులను మీ కోర్స్ లో చేర్పించుకోవచ్చును.  

5. Sell Website Templates Online: Website Templates కు మర్కెట్ లో చాలా డిమాండ్ వుంది. మీరు టెంప్లేట్ డిజైనింగ్ లో ఎక్స్పర్ట్ అయివుంటే, సొంతంగా టెంప్లేట్స్ ను తయారు చేసి ఇంటెర్నెట్ ద్వారా అమ్మి మంచి డబ్బులు సంపాదించవచ్చు. వెబ్ సైట్ టెంప్లేట్స్ లేదా థీంస్ (templates or themes) లలో పాప్యులర్ అయినవి: HTML Templates, Wordpress Themes, Photoshop Templates, Flash Templates and Joomla Templates. మీరు పైన తెలిపిన వాటిలో ఏవైనా వెబ్ సైట్ టెంప్లేట్స్ ను మంచి ఆకర్షణీయంగా తయారు చేసిన తరువాత క్రింద తెలిపిన వెబ్ సైట్ల ద్వారా మీరు వాటిని అమ్ముకోవచ్చును.
themeforest.net
graphicriver.net
fantero.com
templamatic.com
graphicleftovers.com
talkfreelance.com
coswap.com
inkd.com
flashden.net
activeden.net

పైన తెలిపిన వెబ్ సైట్లలో రిజిస్టర్ అయి మీ టెంప్లేట్స్ ను అప్లోడ్ చేసిన తరువాత కొంతమంది వ్యక్తులు మరియు కంపెనీలు మీ టెంప్లేట్స్ ను కొన్నపుడు, ఆ మొత్తంలో నుంచి మీకు కొంత డబ్బు చెల్లిస్తారు. ఈ విధానంలో మీకు చెల్లించే మొత్తం సుమారుగా 25 శాతం నుంచి 75 శాతం వరకు వుంటుంది. అదే విధంగా android మొబైల్స్ కు సంబంధించిన apps ను డెవలప్ చేసి మరియు వెబ్ సైట్ లోగోలను (logo) కూడా తయారుచేసి ఇంటెర్నెట్ ద్వారా అమ్మి మంచి ఆదాయాన్ని పొందవచ్చును.